US Trade deals: రెండు దేశాలకూ బెనిఫిట్ఉండాలి..యూఎస్ ట్రేడ్ డీల్స్పై జైశంకర్

US Trade deals: రెండు దేశాలకూ బెనిఫిట్ఉండాలి..యూఎస్ ట్రేడ్ డీల్స్పై జైశంకర్

అమెరికాతో వాణిజ్యం ఒప్పందంపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత్.. అమెరికాకు 'జీరో టారిఫ్స్' వాణిజ్య ఒప్పందాన్ని అందించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో జైశంకర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

వాషింగ్టన్‌తో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకి తగ్గించడానికి భారత్ ముందుకొచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలో జైశంకర్ అమెరికాతో వాణిజ్యంపై ఇలా స్పందించారు. 

‘‘భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్యలు జరుగుతున్నాయి. ఏ వాణిజ్య ఒప్పందం అయినా రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉండాలి. అమెరికానుంచి మేం కోరుకుంటున్నది అదే. భారత్-,అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు సంక్లిష్టమైనవి.అన్నీ సర్దుకునే వరకు ఏమీ నిర్ణయించబడదని’’ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. 

Also Read : కేవలం POK, టెర్రరిజంపైనే చర్చలు

అమెరికాకు 'జీరో టారిఫ్స్' వాణిజ్య ఒప్పందాన్ని అందించిందని ఖతార్‌లోని దోహాలో జరిగిన వాణిజ్య రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.  భారతదేశంలో మా వస్తువులు అమ్మడం చాలా కష్టం..భారత్ మాకు ఎటువంటి సుంకం విధించకుండానే వాణిజ్య ఒప్పందాన్ని అందించారు" అని ట్రంప్ అన్నారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 26 శాతం సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిస్పందనగా కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని విధించాలని భారత్ నిర్ణయించింది. 

అయితే ఈ చర్య రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి  జరుగుతున్న చర్చలపై నీలినీడలు పడే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) భావించింది. ఈ విషయంపై అమెరికా, భారత్ లో సంప్రదింపులు జరిపినా లేదా సుంకాలను ఉపసంహరించుకున్నా ఒక తీర్మానం రావచ్చని GTRI తెలిపింది.

పాకిస్తాన్తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే..

మరోవైపు ఆపరేషన్ సిందూర్ ప్రభావం, ప్రపంచ దేశాల మద్దతుపై మాట్లాడిన మంత్రి జైశంకర్..పాకిస్తాన్ తో కేవలం ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు జరుతాయన్నారు. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో శాటిలైట్ చిత్రాలే చెబుతున్నాయన్నారు.  పాకిస్తాన్‌తో తమ వైఖరి మారలేదని,భారత్ విధానం మారదని స్పష్టం చేశారు. 

#WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd

— ANI (@ANI) May 15, 2025

‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందే..భవిష్యత్తులో వారికి సపోర్టు చేయబోమని స్పష్టత ఇవ్వాల్సిందే.. ఏం చేయాలో పాకిస్తాన్ కు బాగా తెలిసొచ్చిందన్నారు’’ జైశంకర్. 

భారత్-, హోండురాస్ సంబంధాలు బలోపేతం.. 
న్యూఢిల్లీలో హోండురాస్ రాయబార కార్యాలయం ప్రారంభోత్సవం ప్రారంభించారు జైశంకర్. భారత్, హోండూరస్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయన్నారు. భారత్ దౌత్య నెట్ వర్క్ లో ఇది సానుకూల పరిణామం అన్నారు.