
చనిపోయిన వాళ్లు బతుకుతారా.. చనిపోయిన వాళ్లను బతికించటం సాధ్యమేనా.. సహజంగా అయితే ఇది అసాధ్యం.. ఈ బోలే బాబా మాత్రం చనిపోయిన 120 మంది భక్తులను తిరిగి బతికిస్తాను అంటున్నాడు.. ఈ మాట ఏకంగా పోలీసులకే చెప్పాడు.. మైండ్ బ్లాంక్ అయ్యి.. ఫ్యూజులు ఎగిరిన పోలీసులు.. ముందు వీడిని లోపల వేయండ్రా అంటూ కటకటాల్లోకి నెట్టారు.. యూపీలోని హత్రాస్ లో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో ఏకంగా 121 మంది చనిపోయారు. ఈ ఘటనకు కారణం అయిన బోలే బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని మాటలు విని షాక్ అయ్యారు. చనిపోయిన భక్తులు అందర్నీ తిరిగి బతికిస్తానని.. నాకు అవకాశం ఇవ్వాలంటూ పోలీసులతోనే చెప్పటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.. అంతేనా.. బోలే బాబా మైండ్ సెట్ పైనా అనుమానాలు వస్తున్నాయి.
120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన యూపీ హత్రాస్ ఘటనలో భోలే బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ డిపార్టుమెంట్ లో పనిచేసి ఉద్యోగానికి రిజైన్ చేసి భోలే బాబా అవతారం ఎత్తిన సౌరభ్ కుమార్ కు చెందిన సంచలన విషయాలు బయటపెట్టారు. 1998లో నారాయణ్ సకర్ విశ్వహరి భోలే బాబా అతని భార్య, మరో నలుగురిని ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయిన అమ్మాయిని బ్రతికించడానికి వారి వద్ద మాంత్రిక శక్తులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలో జైలుకు పంపారు. ఈ కేసులో క్యాన్సర్ తో బాధపడుతున్న 16 ఏళ్ల బాలిక మృతిచెందగా.. ఆమెను తిరిగి బ్రతికిస్తానని బాబా చెప్పడం.. స్మశాన వాటికలో బాబా అనుచరులు హాంగామా సృష్టించడంతో అప్పట్లో ఐపీసీ సెక్షన్ 109 క్రింద, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం కింద బాబాపై కేసులు నమోదు అయ్యాయని షాహ్ గంజ్ పోలీసులు చెబుతున్నారు.