లక్ష రూపాయలు ఉన్నాయా? ఈక్విటీలో పెట్టొచ్చు

లక్ష రూపాయలు ఉన్నాయా? ఈక్విటీలో పెట్టొచ్చు

న్యూఢిల్లీ:  ఫైనాన్షియల్‌‌‌‌ మార్కెట్లు ఈ ఏడాది జెట్‌‌‌‌ స్పీడ్‌‌‌‌తో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు ఐపీఓలతో రూ.వేల కోట్లు సేకరించాయి. మరిన్ని ఐపీఓలు మార్కెట్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మ్యూచువల్‌‌‌‌ ఫండ్లకు ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు వరదలా వస్తున్నాయి. కరోనా వల్ల జనం గత రెండేళ్లుగా చాలా తక్కువ ఖర్చు చేశారు. ఫలితంగా మిగిలిన డబ్బును ఇలా ఈక్విటీల్లో పెడుతున్నారు. అందుకే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ లోతు తెలియనివాళ్లు డైరెక్ట్‌‌‌‌గా డబ్బు పెట్టడం రిస్కే! మరి చేతిలో ఉన్న సొమ్మును ఏం చేయాలి ? ఉదాహరణకు 25–30 ఏళ్ల వయసున్న వ్యక్తి దగ్గర రూ.లక్ష ఉంటే.. ఎలా ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలనే ప్రశ్నకు నలుగురు ఫైనాన్షియల్‌‌‌‌ అడ్వైజర్లు ఇలా జవాబిచ్చారు.
పదేళ్లపాటు ఆగే ఓపిక ఉండి, కొంత రిస్కును తట్టుకోగలిగిన యువత అయితే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేయడం మంచిది. ఇప్పటి మార్కెట్‌‌‌‌ కండిషన్లను బట్టి చూస్తే రూ.లక్ష మొత్తాన్ని ఒకేచోట పెట్టకూడదు. ఇందులో సగాన్ని షేర్లలో, మిగతా దానిని రాబోయే ఐపీఓల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేయొచ్చు. లేకపోతే  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ (సిప్‌‌‌‌) ద్వారా మ్యూచువల్‌‌‌‌ ఫండ్లలో పెట్టొచ్చు. మొదటిసారి ఇన్వెస్ట్‌‌‌‌ చేసేవాళ్లు అయితే.. ఈక్విటీ కార్పస్‌‌‌‌లో 20 శాతం డబ్బును ఇండెక్స్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌లో, 45 శాతాన్ని ఫ్లెక్సీ క్యాప్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌లో, 15 శాతాన్ని మిడ్‌‌‌‌ క్యాప్‌‌‌‌, లార్జ్‌‌‌‌ క్యాప్‌‌‌‌ ఫండ్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలి. నాన్‌‌‌‌–ఈక్విటీవైపు చూడకపోవడమే మంచిది. అయితే గత 18 నెలలుగా మార్కెట్‌‌‌‌ పనితీరును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతిగా ఆశలు పెట్టుకోకూడదు.                                                                                                                                                                               -హర్షద్‌‌‌‌ చేతన్‌‌‌‌వాలా, మైవెల్త్‌‌‌‌గ్రో కో-ఫౌండర్‌‌‌‌
యంగ్‌‌‌‌ ఇన్వెస్టర్లు తప్పకుండా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలి. ఇప్పుడైతే మార్కెట్ల వాల్యుయేషన్‌‌‌‌ చాలా ఎక్కువగా ఉంది. మరో 24 నెలల వరకు పెద్దగా రిటర్నులు వచ్చే అవకాశం లేదు. మొత్తం డబ్బును ఒకేచోట గుమ్మరించడం తెలివైన పని కాదు. రాబోయే 12 నెలల్లో డెట్‌‌‌‌, సిప్‌‌‌‌ల ద్వారా ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలి. యువతకు రిస్క్‌‌‌‌ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సీ, మిడ్‌‌‌‌–క్యాప్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌లో డబ్బు పెట్టొచ్చు. ఫ్లెక్సీ ఫండ్స్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ షేర్లలోనూ ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తాయి. కావాలనుకుంటే కొంచెం డబ్బును గోల్డ్‌‌‌‌, డెట్‌‌‌‌ స్కీముల్లో పెట్టొచ్చు. ఇప్పుటికిప్పుడు అయితే మాత్రం గోల్డ్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు ఆకర్షణీయంగా లేవు.                                                                                                              -కీర్తన్‌‌‌‌ షా, చీఫ్‌‌‌‌ ఫైనాన్సియల్‌‌‌‌ ప్లానర్‌‌‌‌, సైక్స్ అండ్‌‌‌‌ రే ఈక్విటీ
లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ ఇన్వెస్టమెంట్ల కోసం చేసే యంగ్‌‌‌‌ ఇన్వెస్టర్లకు ఫ్లెక్సీ క్యాప్‌‌‌‌ ఫండ్‌‌‌‌ చాలా మంచిది. ఎందుకంటే.. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలో మనమే ఫండ్‌‌‌‌ మేనేజర్లకు సూచనలు ఇవ్వొచ్చు. ఫలితంగా మంచి కంపెనీల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉంటాయి. కొన్నాళ్ల తరువాత మార్పులు కూడా చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు డబ్బు చేతిలో ఉంటే, ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ ఫండ్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌ చేయొచ్చు. సిస్టమాటిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ (ఎస్‌‌‌‌టీపీ) ద్వారా వచ్చే పది వారాల్లోపు ఈక్విటీ ఫండ్‌‌‌‌లో డబ్బు పెట్టొచ్చు. నెలవారీ కిస్తీలుగా కట్టాలనుకుంటే సిప్‌‌‌‌ పద్ధతిని ఎంచుకోవచ్చు. 
                                                                                                                                                        -సురేశ్‌‌‌‌ సదాగోపాల్‌‌‌‌, ల్యాడర్‌‌‌‌7 ఫైనాన్షియల్‌‌‌‌ అడ్వైసరీస్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌
మోస్తరు నుంచి ఎక్కువస్థాయి రిస్క్‌‌‌‌ తీసుకునే యంగ్‌‌‌‌ ఇన్వెస్టర్లకు నిఫ్టీ–50 వంటి ఇండెక్స్‌‌‌‌ ఫండ్‌‌‌‌, ఫ్లెక్సీ క్యాప్‌‌‌‌, మిడ్‌‌‌‌ క్యాప్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ మంచివి. కొత్త ఇన్వెస్టర్‌‌‌‌ డబ్బుల్లో ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లోనే పెట్టి పదేళ్ల వరకు ఆగాలి. ఒకే కేటగిరీ కాకుండా వేర్వేరు కేటగిరీల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలి. లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అయితే మొత్తం డబ్బును ఈక్విటీకే కేటాయించవచ్చు. ఇందులో కొంతమొత్తాన్ని సిప్‌‌‌‌లో పెట్టాలి.                                                                                 -మృణ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, ఫిన్‌‌‌‌సేఫ్‌‌‌‌ ఇండియా ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌