షేమ్ షేమ్..కాలం చెల్లిన వస్తువులు పంపిస్తారా?.. శ్రీలంకకు పాకిస్తాన్ మానవతా సాయంపై నెటిజన్ల ఫైర్

షేమ్ షేమ్..కాలం చెల్లిన వస్తువులు పంపిస్తారా?.. శ్రీలంకకు పాకిస్తాన్ మానవతా సాయంపై నెటిజన్ల ఫైర్

శ్రీలకంలో తుఫాను బాధితులకు  పాకిస్తాన్ అందించిన మానవతా సాయంపై పెద్ద దూమారం రేగుతోంది..పాకిస్తాన్ పంపించిన మానవతా సాయం ఆహారం ప్యాకెట్లు, పాలు, తాగునీరు , మెడికల్ కిట్లు ఇతర  సహాయ వస్తువులు కాలం చెల్లినవి అంటూ నెట్టింట ఫొటోలు వైరల్ అవుతుండటంతో వివాదం తలెత్తింది. నెటిజన్లు పాకిస్తాన్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

కొలంబోలోని పాకిస్తాన్ హైకమిషన్  కొన్ని ఫొటోలను  Xలో షేర్ చేసింది.. వాటిని చూపిస్తూ శ్రీలంకలో వరదల్లో ప్రభావితం అయిన సోదర, సోదరీ మణులకు పాకిస్తాన్ నుంచి ప్యాకేజీలను విజయవంతంగా పంపిణీ చేశాం.. ఇది మా సంఘీభావం.. పాకిస్తాన్ ఇప్పుడు, ఎప్పుడు , ఎల్లప్పుడు శ్రీలంకకు సాయం గా ఉంటుందంటూ పోస్ట్ చేశారు. 

అయితే పాకిస్తాన్ సాయంగా పంపించిన ప్యాకెట్లపై ముద్రించిన  ఎక్స్ పెయిరీ డేట్ అక్టోబర్ 2024 అని ఉన్న ఈ ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ కావడంతో నెటిజన్లు ఓ రేంజ్ స్పందించారు. ప్యాకేజీలను శ్రీలంక అధికారులు తనఖీలు చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

►ALSO READ | పాక్ రాజధానిలో రెండు నెలలు 144 సెక్షన్.. ఇమ్రాన్ సపోర్టర్స్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి

ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మానవతా సాయం పంపించే వస్తువులు కూడా ఇలాంటి వి పంపిస్తారా.. షేమ్ షేమ్ అంటూ అంటూ  విరుచుకుపడ్డారు. చెత్తకుప్పలో వేయాల్సిన వస్తువులను శ్రీలంకు మానవతా సాయంగా పంపించారు.. గడువు ముగిసిన పాలపొడి , పిండి. మీ ఛారిటీకి కూడా ఛారిటీ అవసరం బ్రో అని రాశారు.

ఇక ఈ వివాదంపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. అవి తప్పుగా  ముద్రించబడ్డాయాలేదా అవి నిర్దిష్ట వస్తువులకు మాత్రమే వర్తిస్తాయా అనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు..ఇక శ్రీలంక అధికారులు కూడా  ఆ వస్తువులను పంచారా.. లేక నిలిపివేశారా అనే విషయాన్ని ధృవీకరించలేదు.