ఫోనే బంగారమాయెగా..

ఫోనే బంగారమాయెగా..

గోల్డ్‌‌ వాచీ, గోల్డ్‌‌ పెన్‌‌ గురించి మనం విని, చూసి ఉండొచ్చు. కానీ బంగారు స్మార్ట్‌‌ ఫోన్‌‌ను ఎప్పుడైనా చూశారా? నిజంగా అలాంటి ఫోన్​ను తయారు చేసింది ఓ బ్రిటన్ సంస్థ. ఇందు కోసం యాపిల్​ ఐఫోన్​ 13 ప్రో, ఐఫోన్​ 13 ప్రో మ్యాక్స్​ను ఎంపిక చేసుకుంది. అచ్చంగా 18 క్యారెట్ల బంగారంతో ఈ ఫోన్​ రెడీ అయ్యింది. ‘టోటల్‌‌ గోల్డ్‌‌’గా పిలుస్తున్న ఈ ఫోన్​ త్వరలో మార్కెట్​లోకి రిలీజ్​ కానుంది. అది కూడా యూకేలో. 128 జీబీ మొదలుకుని, 1 టీబీ వరకూ వేరియంట్లలో లభిస్తోంది. 99 పీసులను మాత్రమే తయారు చేస్తోంది. వేరియంట్​ను బట్టి 32 లక్షల నుంచి 36 లక్షల వరకూ వీటి ధర ఉంది. ప్రపంచంలోనే ఎక్స్‌‌పెన్సివ్‌‌ యాక్ససరీస్‌‌ తయారీ సంస్థ అయిన కేవియర్‌‌‌‌ 13 రకాల డిజైన్లతో ఈ ఐఫోన్ల డిజైన్‌‌ చేపట్టింది. ఇటలీలో చర్చిలపై ఉండే కళాత్మకమైన బరొక్‌‌ ఆర్కిటెక్చర్‌‌‌‌తో ఓ మోడల్​ను డిజైన్‌‌ చేశారు. కళ్లు మిరిమిట్లుగొలిపేలా ఉన్న ఈ ఫోన్లు ఒక్కో దానికీ ఒక్కో యునీక్​ నెంబర్‌‌‌‌ను యాడ్‌‌ చేస్తున్నారు. హై స్టేటస్‌‌ కోరుకునే వారు, లగ్జరీని ఇష్టపడే వారు ఈ ఫోన్లను సొంతం చేసుకునే పనిలో ఉన్నారు.