
నెయ్యిలో విటమిన్–ఎ, డి, కె, ఇలు ఎక్కువ. ఇవి పిల్లల్లో ఎముకలు బలపడడానికి సాయపడతాయి. అలాగే ఇమ్యూనిటీ పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తాయి. పిల్లలకు రెగ్యులర్‌గా నెయ్యి తినిపిస్తే వాటిల్లో ఉండే డీహెచ్ఏ, ఈపీఏ అనే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్స్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. పిల్లలు ఎనిమిదో నెలలోకి అడుగు పెట్టగానే.. ముందుకంటే ఎక్కువ శక్తి, క్యాలరీలు అవసరమవుతాయి. అందువల్ల పిల్లలకు పెట్టే ఫుడ్‌లో నెయ్యి చేర్చడం ముఖ్యం. దీనివల్ల క్యాలరీలు అందుతాయి. హెల్దీగా బరువు పెరుగుతారు.నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై గీతలు, మచ్చల్ని పోగొడతాయి.
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్ కారకాల నుంచి కాపాడుతుంది. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసి థైరాయిడ్ దరిచేరకుండా చూస్తుంది. పిల్లల గుండె ఆరోగ్యానికి కూడా నెయ్యి చాలామంచిది. రోజుకు రెండు టీ స్పూన్ల నెయ్యి తీసుకుంటే శరీర వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. నెయ్యిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల శరీరంలోని అనవసరపు కొవ్వు తగ్గుతుంది. కొంతమంది పిల్లలకు పాలు నచ్చవు. అలాంటి వాళ్లకు లాక్టోజ్ శాతం తక్కువగా ఉండే నెయ్యి ఇవ్వచ్చు. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. అలాగే లివర్, పేగులు, గొంతులోని వేస్ట్‌ని కూడా నెయ్యి బయటకు పంపుతుంది.