ఆస్ట్రేలియాకు షాక్...గాయంతో హేజిల్ వుడ్ దూరం

ఆస్ట్రేలియాకు షాక్...గాయంతో హేజిల్ వుడ్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలి టెస్టుకు దూరం కాగా..తాజాగా గాయంతో మరో పేసర్ హేజిల్ వుడ్ కూడా తొలి టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. పాదంలో ఉండే అచిలీస్ హీల్ వద్ద హేజిల్ వుడ్కు గాయం కావడంతో  తొలి టెస్టు ఆడటం లేదని తెలుస్తోంది. అయితే రెండో టెస్టుకల్లా అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది గాయం తీవ్రతను బట్టి ప్రకటించే అవకాశం ఉంది. 

ఇప్పుడే చెప్పలేను..

టీమిండియాతో తొలి టెస్టులో ఆడతానో లేదో ఇప్పుడే చెప్పలేనని హేజిల్ వుడ్ తెలిపాడు. గాయం నుంచి కోలుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నాడు. నాగ్ పూర్ టెస్టు సాఫీగా సాగుతుందని భావిస్తున్నట్లు హేజిల్ వుడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

గ్రీన్ దూరమే...

మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్తో పాటు..వేలి గాయంతో ఇప్పటికే ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా తొలి టెస్టులో ఆడేది అనుమానంగా మారింది.  వేలి గాయం నుంచి గ్రీన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.  ఈ ముగ్గురు పేసర్ల గైర్హాజరీతో ..ఆస్ట్రేలియా బౌలింగ్ మరింత బలహీనంగా మారనుంది. 

బుమ్రా కూడా దూరం

మరోవైపు టీమిండియాను సైతం గాయాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదం కారణంగా ఇప్పటికే కీపర్ రిషబ్ పంత్ జట్టుకు దూరమవడగా..బౌలర్ బుమ్రా తొలి రెండు టెస్టుల్లో ఆడటం లేదు. అయితే గాయం నుంచి కోలుకుని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్ తో టెస్టు సిరీస్ లో ఆడనున్నాడు.