ఆ ఇంజనీర్ అకౌంట్లు ఎందుకు క్లోజ్ చేశారు: గూగుల్కు హైకోర్టు నోటీసులు

ఆ ఇంజనీర్ అకౌంట్లు ఎందుకు క్లోజ్ చేశారు: గూగుల్కు హైకోర్టు నోటీసులు

ఇటీవల పోర్న్ కంటెంట్ తొలగింపులో భాగంగా గూగుల్ లక్షల్లో Gmail, Google Drive అకౌంట్లను తొలగించింది. అయితే తన గూగుల్, Gmail అకౌంట్లను కోల్పోయిన ఓ యువ ఇంజనీర్ గూగుల్ పై కోర్టుకెక్కాడు. తనకు అకౌంట్లు కోల్పోవడంతో చాలా నష్టపోయానని.. ఇటు జాబ్ పరంగా..  అటు వ్యక్తిగతంగా చాలా నష్టపోయాయని కేంద్ర ప్రభుత్వానికి, కోర్టుకు ఫిర్యాదు చేశాడు. దీంతో గూగుల్ ఇండియాకు మొట్టికాయలు వేసింది హైకోర్టు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్కు చెందని ఓ యువ ఇంజనీరు ఇటీవల కాలంలో తన గూగుల్ డ్రైవ్, Gmail ఖాతాల యాక్సెస్ ను కోల్పోయాడు.. ఇదేంటని అన్ని సెర్చ్ చేస్తే.. అతని అకౌంట్లో పోర్న్ కంటెంట్ ఉందని.. అందుకే ఖాతాలను తొలగించినట్టు గూగుల్ కంపెనీనుం సమాచారం వచ్చింది. అదేంటీ నా ఖాతాలో అలాంటి కంటెంట్ ఏమీ లేదు కదా..మరెలా బ్లాక్ చేశారని ఆందోళన చెందాడు.. దీంతో గూగుల్ పై పోరాటానికి సిద్ధమయ్యాడు. 

ఇంతకీ గూగుల్ ఆ ఇంజనీరు ఖాతాలను తొలగించడానికి కారణం ఏంటంటే.. ఓ అభ్యంతర కరమైన ఫోటో... అది తన రెండేళ్ల వయసులోని ఫొటో.. అది వాళ్ల అమ్మమ్మ స్నానం చేపిస్తుండగా తీశారట. దీనిని పోర్న్ కంటెంట్ గా నిర్దారణకు వచ్చి గూగుల్ అతని అకౌంట్లను తొలగించింది. 

నిజంగా ఆ ఫొటో పోర్న్ కంటెంట్ కిందికి వస్తుందా.. ఇంతకీ తప్పిదం ఎక్కడ జరిగింది? 2023 ఏప్రిల్ తన చిన్ననాటి ఫోటో .. అదే వాళ్ల అమ్మమ్మ స్నానం చేయిస్తుండగా తీసిన ఫోటోను యువ ఇంజనీరు గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేశాడు.దీంతో అతని అకౌంట్లను తొలగించింది గూగుల్.  గూగుల్ తన కస్టమర్ల అకౌంట్లలో పోర్న్ కంటెంట్ ను గుర్తించడానికి, వాటిని తొలగించేందుకు AI  టెక్నాలజీని వాడుతుందట..అయితే దీనిపై ఆ యువ ఇంజనీరు అనుమానం వ్యక్తం చేస్తూ గుజరాత్ హైకోర్టు ను ఆశ్రయించాడు. 

ఖాతా సస్పెన్సన్ అంటే కేవలం కోల్పోయిన ఫొటోలు మాత్రమే కాదు.. అతని మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఇంజనీరు తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అతని వృత్తిలో ఎక్కువగా భాగం ఈమెయిల్ కమ్యూనికేషన్ పై ఆధారపడి ఉంటుందని.. ఇప్పుడు అది  అందుబాటులో లేకపోవడం నష్టం వాటిల్లుతుందని కోర్టుకు విన్నవించాడు. గూగుల్ ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని కోర్టుకు విన్నవించారు.

దీంతో గూగుల్ ఇండియాకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 26 లోపు తన ప్రతిస్పందన తెలియజేయాలని కోరింది. మరోవైపు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో గూగుల్ పై గుర్రుగాను ఉన్నాయి. మార్చి 26 తర్వాత ఆ యువ ఇంజనీరు కు న్యాయం జరుగుతుందోలేదో వేచి చూద్దాం.