హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గూడూరు, అయోధ్యపురం రెవెన్యూ గ్రామాల షెడ్యూల్ఏరియాలకు సంబంధించిన ప్రకటనలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ రెండు గ్రామాల షెడ్యూల్డ్ ఏరియా హోదాను రద్దు చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
గూడూరు, అయోధ్యపురం గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కె. స్వామి సహా మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోను ఈ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పేర్కొనలేదన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేయకుండా పిటిషన్ వేయడం చెల్లదన్నారు.
