జనవరి 10న హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌!

జనవరి 10న హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌!
  • నిర్వహించాలని మెంబర్స్‌‌‌‌‌‌‌‌ తీర్మానం
  • ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
  • గేటు బయటే ఎస్​జీఎం నిర్వహణ

హైదరాబాద్​, వెలుగు: వచ్చే నెల 10వ తేదీన  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌కు ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించారు. ఆదివారం అనూహ్య పరిణామాల మధ్య దాదాపు 160 మంది హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం గేటు బయట స్పెషల్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ (ఎస్​జీఎం) నిర్వహించారు.  గత పర్యాయం ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ వీఎస్‌‌‌‌‌‌‌‌ సంపత్‌‌‌‌‌‌‌‌ను రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేస్తూ  తీర్మానం చేసినట్టు   ప్రకటించారు. అంతకుముందు మాజీ ప్రెసిడెంట్స్‌‌‌‌‌‌‌‌ జి. వినోద్‌‌‌‌‌‌‌‌, అర్షద్‌‌‌‌‌‌‌‌ ఆయుబ్‌‌‌‌‌‌‌‌, శివలాల్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని మెంబర్స్‌‌‌‌‌‌‌‌ను ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లకు తాళాలు వేయడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో మెంబర్స్‌‌‌‌‌‌‌‌ గేటు బయటే టెంట్‌‌‌‌‌‌‌‌ వేసి ఎస్‌‌‌‌‌‌‌‌జీఎం నిర్వహించారు.

ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం నిర్మాణంలో భాగం అయిన తమను గేటు బయటే అడ్డుకోవడం  దుర్మార్గమైన చర్య అని మాజీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జి. వినోద్‌‌‌‌‌‌‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా  పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అజరుద్దీన్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌సీఏను పాలిస్తున్నాడని, అతని ఆదేశాల మేరకు సిబ్బంది తమను అడ్డుకున్నారని ఆరోపించారు. తమను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, యూసుఫ్‌‌‌‌‌‌‌‌పై మెంబర్స్‌‌‌‌‌‌‌‌ ఉప్పల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.  కాగా, సుప్రీంకోర్టు నియమించిన సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌ కమిటీ అనుమతి లేకుండా నిర్వహించే మీటింగ్​ చెల్లదని అజర్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌కు లెటర్‌‌‌‌‌‌‌‌ రాశాడు.