వరంగల్లో హెచ్సీఏ టోర్నమెంట్ షురూ

వరంగల్లో హెచ్సీఏ టోర్నమెంట్ షురూ
  •     వేర్వేరు మ్యాచుల్లో వరంగల్​, కరీంనగర్​ జట్లు విజయం

ధర్మసాగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్​సీఏ) ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా జరుగుతున్న తెలంగాణ అంతర్‌‌ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్​లో జరిగిన మొదటి మ్యాచ్‌‌లో వరంగల్, నిజామాబాద్ జట్లు తలపడ్డాయి. రంజీ ప్లేయర్ తోట సుకాంత్ టాస్ వేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 30.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది.

ఫన్నాన్(30) టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. వరంగల్ బౌలర్ పూజిత్ 6 వికెట్లు తీసి మెరిశాడు. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ జట్టు 24.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొగిలిచర్ల గ్రౌండ్​లో జరిగిన మరో మ్యాచ్‌‌లో కరీంనగర్, ఆదిలాబాద్ జట్లు తలపడగా, కరీంనగర్ 158 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కరీంనగర్ 231 పరుగులు చేయగా, తక్షిల్ 188, రుత్విక్ 94 పరుగులతో అదరగొట్టారు. ఆదిలాబాద్ 174 పరుగులకే పరిమితమైంది.