చెన్నై: ఇండియా టాప్ ప్లేయర్లు అభయ్ సింగ్–వేలవన్ సెంథిల్ కుమార్ జోడీ.. హెచ్‌సీఎల్ నేషనల్ డబుల్స్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్‌లో అభయ్–సెంథిల్ 11–1, 11–6తో రవి దీక్షిత్–వికాస్ మెహ్రాపై, రాహుల్ బైథా–సూరజ్ కుమార్ చంద్ 11–8, 11–7తో గుహన్ సెంథిల్ కుమార్–సందేష్‌పై గెలిచారు.
మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో వేలవన్ సెంథిల్ కుమార్–జోష్న చిన్నప్ప 11–6, 11–9తో రాహుల్ బైథా–అనికా దూబేపై గెలవగా, అభయ్ సింగ్–రాధిక శీలన్ 12–10, 11–7తో సూరజ్ కుమార్ చంద్–నిరూపమ దూబేను ఓడించారు. విమెన్స్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప–రాధిక శీలన్ 11–5, 11–4తో అనన్య నారాయణ్–అనికా దూబేపై, జానెట్ విధి–పూజ 8–11, 12–10, 11–5తో నిరుపమ దూబే–షమీనా రియాజ్ జోడీపై గెలిచారు.
