హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి రూ.291 కోట్ల లాభం

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి రూ.291 కోట్ల లాభం
  • ఏటా 42 శాతం పెరుగుదల
  • మొత్తం ఆదాయం రూ.552 కోట్లు

ముంబై: హెచ్‌‌డీఎఫ్‌‌సీ అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీ (ఏఎంసీ) ఈ ఏడాది జూన్‌‌తో ముగిసిన క్యూ1లో అదరగొట్టింది. గత ఏడాది క్యూ1 లాభాలు రూ.205 కోట్లతో పోలిస్తే ఈసారి లాభాలు 42 శాతం పెరిగి రూ.292 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం రూ.501 కోట్ల నుంచి రూ.552 కోట్లకు పెరిగింది. మనదేశంలో అతిపెద్ద ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌‌ ఫండ్‌‌ కంపెనీ హెచ్‌‌డీఎఫ్‌‌సీ ఏఎంసీయే! దీని ఏయూఎంలు (అసెట్స్‌‌ అండర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌) గత క్యూ1తో పోలిస్తే ప్రస్తుతం క్యూ1లో 18 శాతం పెరిగి రూ.3.56 లక్షల కోట్లకు చేరాయి.

అర్బిట్రేజ్‌‌, ఇండెక్స్ ఫండ్స్‌‌ మినహా మిగతా ఏయూఎం విలువ ఈ ఏడాది జూన్‌‌ 30 నాటికి రూ.1.68 లక్షల కోట్లకు చేరింది. ఈ క్వార్టర్‌‌లో కంపెనీ హెచ్‌‌డీఎఫ్‌‌సీ మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ ఫిక్స్‌‌డ్‌‌ మెచ్యూరిటీ ప్లాన్స్‌‌లో కొన్నింటికి లిక్విడిటీ అందజేసింది. నాన్‌‌ కన్వర్టబుల్‌‌ డిబెంచర్ల వల్ల ఎఫ్‌‌ఎంసీలకు లిక్విడిటీ కొరత రావడమే ఇందుకు కారణం. అందుకే ఇది రూ.426 కోట్ల విలువైన ఎన్సీడీలను కొనుగోలు చేసింది. వీటికి కొన్ని లిస్టెడ్‌‌ ఈక్విటీ షేర్లను తనఖా పెట్టారు. వీటికితోడు ఈ నెల ఒకటిన కూడా రూ.33.26 కోట్ల విలువైన ఎన్సీడీలను హెచ్‌‌డీఎఫ్‌‌సీ ఏఎంసీ కొన్నది.