సన్‌‌‌‌‌‌‌‌ ఫార్మా లాభం రూ.2,654 కోట్లు

సన్‌‌‌‌‌‌‌‌ ఫార్మా లాభం రూ.2,654 కోట్లు

 న్యూఢిల్లీ: సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌( క్యూ4) లో రూ.2,654.58 కోట్ల నికర లాభం ( కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 1,984.47 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. సన్ ఫార్మా రెవెన్యూ రూ.10,930.67 కోట్ల  నుంచి రూ.11,982.9 కోట్లకు ఎగసింది. ఇండియా ఫార్ములేషన్  సేల్స్ రూ. 3,707.8 కోట్లుగా, యూఎస్ ఫార్ములేషన్ సేల్స్ 476 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3,964 కోట్లుగా) నమోదయ్యాయి.

  ఒక్కో షేరుకి రూ.5  ఫైనల్ డివిడెండ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని సన్ ఫార్మా బోర్డ్ నిర్ణయించింది. రూ.8.5 ఇంటెరిమ్‌‌‌‌‌‌‌‌ డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను కంపెనీ ఇప్పటికే ఇచ్చింది. దీంతో కలిపితే 2023–24 కి గాను  షేరుకి రూ.13.5 డివిడెండ్‌‌‌‌  ఇచ్చినట్టు.