సత్య నాదెళ్లకు ఫైన్

సత్య నాదెళ్లకు ఫైన్

న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం ‘ముఖ్యమైన లాభదాయకమైన యజమాని’ నిబంధనలను (ఎస్​బీఓలు) ఉల్లంఘించినందుకు మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్‌‌‌‌ఇన్ ఇండియాతోపాటు సత్య నాదెళ్ల  మరో ఎనిమిది మందిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది.  మైక్రోసాఫ్ట్  డిసెంబర్ 2016లో ప్రొఫెషనల్ నెట్‌‌‌‌వర్కింగ్ ప్లాట్‌‌‌‌ఫారమ్ లింక్డ్‌‌‌‌ఇన్‌‌‌‌ను కొనుగోలు చేసింది.

  సత్య నాదెళ్ల,  ర్యాన్ రోస్లాన్స్కీ తదితరులు కంపెనీ ఎస్​బీఓల గురించి సెక్షన్ 90(1) ప్రకారం రిపోర్ట్ చేయడంలో విఫలమైన కారణంగా ఈ చర్య తీసుకుంది. ర్యాన్  జూన్ 1, 2020న లింక్డ్‌‌‌‌ఇన్ కార్పొరేషన్  గ్లోబల్ సీఈఓగా నియమితులయ్యారు.  సెక్షన్ 90 ఎస్​బీఓకి సంబంధించినది. దీని ప్రకారం కంపెనీలు ఎస్​బీఓ వివరాలను వెల్లడించాలి.  సత్య, ర్యాన్​తోపాటు మరో ఏడుగురు వ్యక్తులపై ఆర్​ఓసీ మొత్తం రూ. 27,10,800 జరిమానా విధించింది. లింక్డ్ఇన్​కు రూ. 7 లక్షలు, నాదెళ్ల, ర్యాన్​కు  రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు.