బీమా బిజినెస్​లోకి మహీంద్రా ఫైనాన్స్

బీమా బిజినెస్​లోకి మహీంద్రా ఫైనాన్స్

 న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ బుధవారం బీమా నియంత్రణ సంస్థ ఐఆర్​డీఏఐ నుంచి కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ను పొందింది. దీంతో ఇది ఇక నుంచి జీవిత,  సాధారణ బీమా పాలసీలను ఇవ్వడం సాధ్యమవుతుంది. తమ  రిజిస్ట్రేషన్ మే 21, 2024 నుంచి మే 20, 2027 వరకు చెల్లుబాటులో ఉంటుందని మహీంద్రా ఫైనాన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. తమ 1,360  బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లలోని కస్టమర్‌‌‌‌‌‌‌‌లకు పాలసీలు  విక్రయిస్తామని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది.