హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా..
  • ఇంటెరిమ్​ చైర్మన్​గా కేకే మిస్త్రీ

న్యూఢిల్లీ: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్ అతాను చక్రవర్తి గురువారం రాజీనామా చేశారు. నైతిక విలువల కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బ్యాంక్ పనితీరులో కొన్ని అంశాలు తన వ్యక్తిగత విలువల ప్రకారం లేవని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఒక పార్ట్ టైమ్ చైర్మన్ పదవీ కాలం మధ్యలో తప్పుకోవడం ఈ బ్యాంక్ చరిత్రలో ఇదే తొలిసారి. 2021 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. 

అతాను రాజీనామాను ఆమోదించిన బోర్డు, కేకీ మిస్త్రీని తాత్కాలిక చైర్మన్​గా నియమించింది. ఆర్​బీఐ ఈ నియామకానికి మూడు నెలలపాటు అనుమతి ఇచ్చింది. అతాను చక్రవర్తి గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా రిటైర్​ అయ్యారు. హెచ్​డీఎఫ్​సీ విలీన ప్రక్రియ సమయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం బ్యాంక్ కార్యకలాపాల్లో పారదర్శకతపై చర్చ జరుగుతోంది. ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని బ్యాంక్ వెల్లడించింది. హెచ్​డీఎఫ్​సీ  ​ఆర్థితి పరిస్థితి బాగుందని, ప్రస్తుత పరిణామాలపై ఆందోళన చెందడం లేదని ఆర్​బీఐ పేర్కొంది.