హైదరాబాద్ నగరంలోని హబీబ్ నగర్‌లో ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఇవాళ తెల్లవారు జామున దోబీఘాట్‌కి చెందిన మహమ్మద్ గౌస్… పార్క్ చేసి ఉన్న 9 ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం సరిగాలేక గౌస్ ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలు దగ్ధం కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం రాత్రి బంజారాహిల్స్.. సింగడికుంటలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బస్తీలో మద్యం తాగి హంగామా చేశారు. పీటర్ అనే వ్యక్తికి చెందిన ఒక కారు , రెండు ఆటోలు ధ్వంసం చేశారు . దీంతో.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో మరికొందరు పరారీలో ఉన్నట్టు గుర్తించారు.
