ఫోన్లో గేమ్ ఆడుతూ.... క్యాబ్ నడుపుతూ...

ఫోన్లో గేమ్ ఆడుతూ.... క్యాబ్ నడుపుతూ...
  • హైదరాబాద్ నడిబొడ్డున నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్యాబ్ డ్రైవర్
  • క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రయాణికుడు

హైదరాబాద్: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ఓ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నగరం నడిబొడ్డున సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ కారు నడిపాడు. గమనించిన కస్టమర్ వద్దని ఎంత వారించినా వినకుండా... ఫోన్ లో గేమ్ కంటిన్యూ చేశాడు. దీంతో ఆ కస్టమర్ తన సెల్ ఫోన్ లో డ్రైవర్ నిర్వాకాన్ని రికార్డు చేశాడు. కారులో నుంచి దిగాక... ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. అనంతరం ఆ వీడియోను  హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. 

‘‘ కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ కనీసం సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదు. పైగా డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతున్నాడు. వద్దని ఎంత చెప్పినా అతడు వినలేదు’’ అంటూ ఆ ప్రయాణికుడు కామెంట్ చేశాడు. ఇక వీడియోలో ప్రయాణికుడి ప్రశ్నకు బదులిస్తూ తాను డెల్ కంపెనీతో టైఅప్ పెట్టుకున్నానని రాజు అనే ఆ కారు డ్రైవర్ చెప్పడం కొసమెరుపు.