ఇకపై గ్రే కలర్ లో ప్రభుత్వ అధికారుల ట్విట్టర్ అకౌంట్స్

ఇకపై గ్రే కలర్ లో ప్రభుత్వ అధికారుల ట్విట్టర్ అకౌంట్స్

ఎలన్ మస్క్ ట్విట్టర్ లో బ్లూటిక్ కు సంబంధించిన మార్పులను నెమ్మదిగా సవరిస్తున్నారు. ఇప్పటికే బ్లూ టిక్ ఉన్న అకౌంట్లను వెరిఫై చేసి వాటికి సంబంధించిన రంగు బ్యాడ్జ్ లను కేటాయించారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు గ్రే కలర్ వెరిఫికేషన్ టిక్ బ్యాడ్జ్ ను కేటాయించారు. ఇవాళ్టి నుంచి ప్రభుత్వ అధికారుల ట్విట్టర్ టిక్స్ గ్రే కలర్ లో కనిపిస్తాయి.

ఇదివరకు నీలం రంగులో ఉన్న వెరిఫైడ్ అకౌంట్లను మూడు కేటగిరీలుగా కంపెనీలు, ప్రభుత్వ అధికారులు, వ్యక్తులుగా (సెలబ్రెటీ) ఎలన్ మస్క్ విభజించారు. వాటికి మూడు రంగులున్న వెరిఫికేషన్ బ్యాడ్జ్ గ్రే (ప్రభుత్వ అధికారులకు), గోల్డ్ (కంపెనీలకు), బ్లూ (వ్యక్తులకు)లను కేటాయించాడు.