ఏ పని చేసినా అందులో క్రియేటివ్‌గా ఉండాలి. అప్పుడే గుర్తింపుతో పాటు గిరాకీ కూడా పెరుగుతుంది. ఈ చెఫ్ కూడా అదే చేస్తున్నాడు. టేస్టీగా వండడమే కాదు తన కలినరీ స్కిల్‌తో ఫుడ్ ఆర్ట్ చేస్తాడు కూడా. పండ్ల మీద సెలబ్రిటీల బొమ్మలు గీయడంలో ఎక్స్పర్ట్ ఇతను. పేరు జితేందర్. ఉండేది ఢిల్లీలో. ఈమధ్యే లతామంగేష్కర్ బొమ్మ గీశాడు ఈ చెఫ్. ‘మేరీ ఆవాజ్ హీ, మేరీ పహెచాన్’ అని హిందీలో రాశాడు. పెద్ద పుచ్చకాయ మీద లత బొమ్మ వేసి ఆమె మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. గతంలో వింగ్ కమాండర్ అభినందన్ బొమ్మ కూడా వాటర్‌మెలన్‌పై గీశాడు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ ఫొటోల్ని కూడా పండ్ల మీదకు తెచ్చాడు ఈ క్రియేటివ్ చెఫ్. ఇతని ఆర్ట్‌వర్క్ చూసినవాళ్లంతా ‘వావ్’ అంటున్నారు. ఫుడ్ ఆర్ట్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల పైనే ఫాలోవర్స్ ఉన్నారు.
