టిప్పర్​ డ్రైవర్​ సజీవ సమాధి: గుర్తించక.. మట్టి పోశారు

టిప్పర్​ డ్రైవర్​ సజీవ సమాధి: గుర్తించక.. మట్టి పోశారు

కోనరావుపేట,వెలుగు: అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ వలసకూలీ సజీవ సమాధి అయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని మల్కపేట రిజర్వాయర్ కట్ట పనుల్లో భాగంగా ధర్మారం వద్ద బండ్ 6 లో మంగళవారం తమిళనాడుకు చెందిన సెల్వరాజ్ (35) మీద మట్టి వేయడంతో సజీవ సమాధి అయ్యాడు. టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న సెల్వరాజ్​ సోమవారం రాత్రి కట్ట మీద పడుకున్నాడు. అది గమనించని నైట్ షిఫ్ట్ టిప్పర్లు అతని మీద మట్టిని పోశాయి. మంగళవారం ఉదయం డోజర్​తో చదును చేస్తుండగా మట్టికింద పడిఉన్న సెల్వరాజ్​ను గుర్తించారు. స్థానికులు అతన్ని మట్టినుంచి బయటకు తీయగా అప్పటికే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సరైన రక్షణ చర్యలు, వసతులు కల్సించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం