కేసీఆర్ కిట్ నుంచి జాన్సన్ పౌడర్ ఔట్

కేసీఆర్ కిట్ నుంచి జాన్సన్ పౌడర్ ఔట్
  • హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కిట్‌‌ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌‌‌‌ను తీసేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి ఆదేశించారు. ఇప్పటికే స్టోర్లలో, ఆస్పత్రుల్లో ఉన్న కిట్లలో నుంచి బేబీ పౌడర్‌‌‌‌ను తీసి పక్కన పెట్టాలని అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు స్పష్టం చేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌‌‌‌ను మహారాష్ట్ర సర్కార్ ఇటీవల నిషేధించింది. దీంతో పౌడర్‌‌‌‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు జేఅండ్‌‌జే కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ పౌడర్ డబ్బాలను పక్కనపెట్టాలని హెల్త్ కమిషనర్‌‌‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.