ముషీరాబాద్, వెలుగు: కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్టార్ హెల్త్ హాస్పిటల్ సౌజన్యంతో బుధవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ షికారిక, కార్డియాలజిస్ట్ వంశీ ఏర్పాటు చేసిన ఈ క్యాంప్‌లో ఇనిస్టిట్యూట్‌ఉద్యోగులకు హెల్త్ చెకప్‌లు చేశారు. ఈ సందర్భంగా బ్లడ్, హార్ట్ టెస్ట్‌లు, ఈసీజీ, బీపీ, షుగర్ ఇతర పరీక్షలు చేసి వారికి సలహాలు, సూచనలు చేశారు.
అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ స్ట్రెస్‌తో కూడిన లైఫ్ కారణంగా అనేక రకాలైన రోగాలు చుట్టుముడుతున్నాయని తెలిపారు. సరైన వైద్య చికిత్సలు చేయించుకొని, రోజూవారీ జీవనంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఒత్తిడి నివారించుకోవచ్చని సూచించారు. హార్ట్ సంబంధిత రోగులు రోజు 20 నిమిషాలపాటు వ్యాయామం, వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని.. తాజా ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లు, హాస్పిటల్ డిప్యూటీ మేనేజర్ పద్మాకర్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.