విషమంగానే వైద్య విద్యార్థి ప్రీతి ఆరోగ్యం

విషమంగానే వైద్య విద్యార్థి ప్రీతి ఆరోగ్యం

సీనియర్ల వేధింపులు భరించలేక వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.  మెరుగైన చికిత్స కోసం వరంగల్ నుండి నిమ్స్ కు తీసుకువచ్చే సమయంలో ప్రీతి గుండె రెండుసార్లు  ఆగిపోయింది.

వెంటనే వైద్యులు సీపీఆర్ చేయడంతో ఆమె గుండె తిరిగి కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రీతికి ప్రస్తుతం అనస్థీసియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషినయన్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తాము ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్ వైద్యులు అంటున్నారు. సాయంత్రం ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది.

సీనియర్ల వేధింపులు తట్టుకోలేక  ప్రీతి అధిక మొత్తంలో మత్తుమందు తీసుకుంది. ఇక సీనియర్ విద్యార్థి సైఫ్ వేదింపుల వల్ల తన బిడ్డ ఆత్మహత్యాయనికి పాల్పడిందని ప్రీతి తండ్రి, బాబాయ్ చెబుతున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సైఫ్‌పై  పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.