జ్వరాలొస్తున్నయ్ జాగ్రత్త!

జ్వరాలొస్తున్నయ్ జాగ్రత్త!
  • జనం అలర్ట్ గా ఉండాలని డాక్టర్ల సూచన
  • వారంలో 46 వేల ఫీవర్ కేసులు 
  • 6,616 డయేరియా కేసులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానలతో పాటే సీజనల్ రోగాలు కూడా మొదలయ్యాయి. గడిచిన వారంలో 46,206 ఫీవర్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌‌‌‌, మేడ్చల్ జిల్లాల్లోనే 10 వేల కేసులు ఉండగా.. ఆదిలాబాద్‌‌‌‌, భూపాలపల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌‌‌‌లో ఈ సారి డెంగీ కేసులు కూడా విజృంభించే అవకాశం ఉందని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ అంచనా వేసింది. కేసుల నమోదు కూడా మొదలైంది. ఇదే విషయాన్ని జీహెచ్‌‌‌‌ఎంసీకి ఇప్పటికే తెలియజేసింది. దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక జిల్లాల్లో వైరల్ ఫీవర్లు, డయేరియా కేసులు ఎక్కువైతున్నాయి. గడిచిన పది రోజుల్లో 6,616 డయేరియా కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్‌‌‌‌, మలేరియా సస్పెక్టెడ్ కేసులు పది వేలకుపైనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

236 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆదివారం 236 నమోదయ్యాయని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రకటించింది. ఇందులో 221 హైదరాబాద్‌‌‌‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో బీఏ4, బీఏ5 వేరియంట్ విస్తరిస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. 

జాగ్రత్తగా ఉండాలి 

జ్వరాల సీజన్ ప్రారంభమైంది. ఆస్పత్రిలో  ఫీవర్ కేసులు పెరుగుతున్నయి. మా డాక్టర్లను, స్టాఫ్‌‌‌‌ ను అలర్ట్ చేసినం. మరోవైపు, కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. జనాలు జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించించి టెస్టులు చేయించుకోవాలి. కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌‌‌‌లో ఉంటూ ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోవాలి. బయటి ఫుడ్ కంటే, ఇంట్లోని తిండికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి.

- డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్‌‌‌‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌