
కరీంనగర్ టౌన్, వెలుగు : సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డా. రవీందర్ నా యక్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ సిటీలోని జిల్లా జనరల్ హాస్పిటల్ను సందర్శిం చారు. ఆయన మాట్లాడుతూ వానాకాలం నే పథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, సిబ్బందితోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాధారణ కాన్పులపై గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించాల న్నారు.
వార్డులను పరిశీలించి పేషెంట్లతోమాట్లా డారు. వారికి అందుతున్న సేవలపై ఆరాతీశారు. అనంతరం డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ రివ్యూనిర్వ హించారు. హాస్పిటల్నుపరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. పీహెచ్సీల నుంచి వస్తున్న రిఫరల్ కేసులకు ప్రాముఖ్యమివ్వాలన్నారు. హాస్పిటల్లో మందుల కొరత లేకుండా సరఫరాకు చర్యలు తీ సుకోవాలన్నారు. డీఎంహెచ్త్వో వెంకటరమణ, సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, పీవోఎంసీహెచ్ సనజవేరియా, మలేరియా నివా రణాధికారి స్వామి పాల్గొన్నారు.