మినిస్టర్‌‌‌‌ దామోదర రాజనర్సింహకు నిమ్స్‌‌లో చికిత్స

మినిస్టర్‌‌‌‌ దామోదర రాజనర్సింహకు నిమ్స్‌‌లో చికిత్స
  • కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హెల్త్‌‌ మినిస్టర్‌‌‌‌ దామోదర రాజనర్సింహ నిమ్స్‌‌లో చికిత్స పొందారు. జ్వరం, ఇతర అనారోగ్య కారణాలతో మంత్రి మంగళవారం నిమ్స్‌‌లో చేరారు. ఆయనకు నిమ్స్‌‌ డైరెక్టర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ బీరప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. కాగా, బుధవారం మంత్రి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆయనను హాస్పిటల్‌‌ నుంచి డిశ్చార్జి చేశారు.