హాస్పిటళ్లు, హాస్టళ్లలోని క్యాంటీన్లపై నిఘా పెట్టండి : మంత్రి దామోదర

హాస్పిటళ్లు, హాస్టళ్లలోని క్యాంటీన్లపై నిఘా పెట్టండి :   మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని హాస్టళ్లు, క్యాంటీన్లతో పాటు అన్ని హాస్పిటల్స్​లోని క్యాంటీన్లపై నిఘా పెట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. క్యాంటీన్లు అన్నీ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీసుకునే లా చర్యలు చేపట్టాలని సూచించారు. మొబై ల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా విస్తృత తనిఖీ లు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశిం చారు. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ను బలోపేతం చేయడంతోపాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేయాలని సూచిం చారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు అవసర మైన మందులను అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ మేరకు హెల్త్, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐపీఎం డైరెక్టర్ శివలీల పాల్గొన్నారు.