సీజనల్ వ్యాధులతో అలర్ట్గా ఉండాలె

సీజనల్ వ్యాధులతో అలర్ట్గా ఉండాలె

హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించా రు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని సూచించారు. పంచా యతీ రాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో వ్యాధుల పై అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ, చికిత్స వేగంగా అందించడం వంటివి చేయాలన్నారు. మంగళవారం వెంగళరావు నగర్​లోని ఇండియన్ ఇని​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్​ నుంచి రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ పరిధి జిల్లాల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి హ‌‌రీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలన్నారు.