అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అమిత్ షా

అబద్దాలకు  కేరాఫ్ అడ్రస్ అమిత్ షా

అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలిపామని, అమిత్ షానే అబద్దాపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు పైసా ఇవ్వలేదని, నిధులు ఇచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమిత్ షా అబద్ధాలు తెలంగాణలో నడవవన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు పరిశీలించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో రూ.10కోట్లతో ఇంటిగ్రేటెడ్ కార్యాలయానికి భూమి పూజ చేశారు. 

మరిన్ని వార్తల కోసం.. 

కూతురు కోసం 30 ఏళ్లుగా పురుషుడి అవతారంలో

అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ