ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ

కొందరు స్టేటస్‌‌ కోసం గాడ్జెట్స్ వాడుతుంటారు. కొందరు ఇష్టంతో వాడుతుంటారు. కానీ.. చాలామంది గాడ్జెట్స్‌‌ని కంఫర్ట్స్‌‌ కోసం వాడతారు. అలాంటి వాళ్ల కోసం ఎన్నో గాడ్జెట్స్ మార్కెట్‌‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో వాడగలిగే 1,000 రూపాయలలోపు ధర ఉండే కొన్ని గాడ్జెట్స్‌‌ ఉన్నాయి. అవసరమైన వాళ్లు ఆన్‌‌లైన్‌‌లో వాటిని కొనుక్కోవచ్చు. 

బల్‌‌ఫైస్‌‌ వైర్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ 
ఇంట్లో ఒక్కొక్కరికీ ఒక్కో స్మార్ట్‌‌ ఫోన్ ఉంటుంది. వాటితో ఎన్నో గాడ్జెట్స్‌‌ ఉంటాయి. వాటిన్నింటికీ ఒక్కో గాడ్జెట్‌‌కి ఒక్కో ఛార్జర్‌‌‌‌ ఉంటుంది. అవన్నీ డెస్క్‌‌ మీద పెట్టినప్పుడు ఛార్జర్ల కేబుల్స్‌‌ అన్నీ చిందరవందరగా అవుతాయి. పైగా ఇప్పుడు ప్రతి ఇంట్లో కంప్యూటర్‌‌‌‌ కామన్ అయిపోయింది. దానికోసం కూడా కొన్ని కేబుల్స్‌‌ టేబుల్‌‌ మీద వేలాడుతుంటాయి. వాటన్నింటినీ ఆర్గనైజ్‌‌ చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు ఈ వైర్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ని కొంటే సరిపోతుంది. ఈ ప్యాక్‌‌లో 18 పీస్‌‌లు ఉంటాయి. వైర్లను ఆర్గనైజ్‌‌ చేయడానికి ఒక్కోటి ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది. వీటిని రబ్బర్‌‌‌‌తో తయారుచేశారు.  ధర : 349 రూపాయలు

వార్‌‌ హ్యామర్‌‌‌‌ ఆర్జీబీ గేమింగ్‌‌ ప్యాడ్
ఇది ఆర్జీబీ లైటింగ్‌‌తో వచ్చే గేమింగ్ మౌస్‌‌, కీబోర్డ్‌‌ ప్యాడ్‌‌. గేమ్స్‌‌ ఆడేవాళ్లు కీబోర్డ్‌‌, మౌస్‌‌ని స్పీడ్‌‌గా కదుపుతుంటారు. అలాంటివాళ్లు మౌస్‌‌, కీబోర్డ్‌‌లను టేబుల్‌‌పై పెట్టుకుంటే కంఫర్ట్‌‌ మిస్సవుతారు. అలాంటివాళ్లు దీన్ని కొనుక్కోవచ్చు. ఇది కీబోర్డ్‌‌, మౌస్‌‌ పెట్టుకునేంత పెద్ద సైజులో ఉంటుంది. దీని చుట్టూ ఉండే స్ట్రిప్‌‌లో మూడు రంగుల లైట్లు ఉంటాయి. వాటి రంగులు మార్చేందుకు, ఆన్‌‌/ఆఫ్ చేసేందుకు ఒక బటన్‌‌ కూడా ఉంటుంది. ప్యాడ్‌‌ నుంచి ల్యాప్‌‌టాప్‌‌ లేదా పీసీకి మైక్రో యూఎస్‌‌బీ– యూఎస్‌‌బీ ఏ కేబుల్‌‌తో కనెక్ట్‌‌ చేయాలి. బటన్‌‌ని లాంగ్‌‌ ప్రెస్‌‌ చేస్తే ఆన్‌‌/ఆఫ్‌‌ అవుతుంది. సింగిల్ క్లిక్‌‌తో లైట్ల కలర్స్‌‌ని మార్చుకోవచ్చు. దీని కింది భాగంలో రబ్బర్‌‌‌‌ బేస్‌‌ ఉండడం వల్ల టేబుల్‌‌కి అతుక్కుపోయినట్టు ఉంటుంది. మౌస్‌‌, కీబోర్డ్‌‌ ఆపరేట్‌‌ చేస్తుంటే కదలదు.  ధర: 849 రూపాయలు

స్ట్రిఫ్‌‌ ల్యాప్‌‌టాప్ స్టాండ్‌‌
వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌ చేసేవాళ్లలో చాలామంది బెడ్‌‌పై, స్టూల్స్‌‌ మీద ల్యాప్‌‌టాప్‌‌ని పెట్టి ఆపరేట్‌‌ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ల్యాప్‌‌టాప్‌‌ కింది భాగానికి గాలి తగలకపోవడంతో బాగా వేడెక్కుతుంటాయి. కానీ.. అలాంటి వాళ్లు ఈ ల్యాప్‌‌టాప్‌‌ స్టాండ్‌‌ని వాడితే సరిపోతుంది. ఇది తక్కువ ధరలో దొరికే అడ్జస్టబుల్‌‌ స్టాండ్‌‌. దీనిపై ల్యాప్‌‌ పెట్టుకుని కావాల్సినంత ఎత్తుకి పెంచుకోవచ్చు.  ల్యాప్‌‌టాప్‌‌కి ఎయిర్ సర్క్యులేషన్‌‌ కూడా బాగుంటుంది. దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. స్టాండ్‌‌కి కనెక్ట్‌‌ చేసుకోవడానికి ఒక మొబైల్‌‌ హోల్డర్‌‌‌‌ కూడా వస్తుంది. ధర: 329 రూపాయలు

సకోరవేర్‌‌ కొలాప్సబుల్‌‌ కప్‌‌ 
ట్రావెలింగ్‌‌ చేసేవాళ్లకు లగేజ్‌‌ మోసుకెళ్లడం పెద్ద సమస్య. అలాంటివాళ్లు ఈ కప్‌‌ని ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. దీన్ని చిన్నగా మడిచి బ్యాగ్‌‌లో వేసుకుని తీసుకెళ్లొచ్చు. కాఫీ తాగాలి అనిపించినప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఫుడ్‌‌ గ్రేడ్‌‌ సిలికాన్‌‌తో తయారు చేశారు కాబట్టి వేడిగా ఉండే కాఫీ, టీ కూడా దీనిలో పోసుకుని తాగొచ్చు. ఈ కప్‌‌కు లీక్‌‌ఫ్రూఫ్​ క్యాప్‌‌ కూడా ఉంటుంది. దీన్ని టేబుల్‌‌పై పెట్టుకోవడానికి కప్పుతోపాటు ఒక చిన్న స్టాండ్‌‌ కూడా వస్తుంది. దీన్ని క్లీన్‌‌ చేయడం కూడా చాలా ఈజీ.  ధర: 399 రూపాయలు