ఆరోగ్యశ్రీ బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం

ఆరోగ్యశ్రీ బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం
  • పలు సేవా కార్యక్రమాలు ప్రారంభం
  • ఆర్య వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తాం
  • రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ  బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పదని మంత్రి అన్నారు. ఖైరతాబాద్ లో  వాసవి గ్రూప్ ఆధ్వర్యంలో క్యాత్ ల్యాబ్ ,ఐ కేర్  ,కార్డియా క్యాత్ ల్యాబ్, కాంటీన్ వంటి పలు సేవలను మంత్రి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...వాసవి గ్రూప్ సంస్థలు పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలను తక్కువ ఖర్చుతో అందిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆర్యవైశ్యులకు అనేక అవకాశాలు కల్పించారన్నారు. ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కింద కేవలం 20 లక్షల మందికి లబ్ది చేకూరితే ..ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల మంది  వరకు లాభపడ్డారని మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ లో 50 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని, నిమ్స్ ని అప్ గ్రేడ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ దయానంద గుప్తా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వాసవి గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతి శ్రీ పండిట్