పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడండి : మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడండి : మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు : పేషెంట్లతో డాక్టర్లు ఆప్యాయంగా మాట్లాడాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన 929 మంది డాక్టర్లకు శనివారం ఆయన జాబ్ అపాయింట్‌‌మెంట్‌‌ లెటర్లు అందజేశారు. సోమవారం నుంచి వీరు విధుల్లో చేరనున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శిల్ప కళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఐడీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎర్రొళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌‌‌‌‌‌‌‌కుమార్, హెల్త్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు సెక్రటరీ గోపీకాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త డాక్టర్లకు మంత్రి ఆరోగ్యశాఖలోకి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ డ్యూటీ టైమింగ్స్ తప్పకుండా ఫాలో కావాలని చెప్పారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలకు వచ్చే పేద పేషెంట్లతో మర్యాదగా నడుచుకోవాలని, వారితో ఆప్యాయంగా మాట్లాడి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందించాలన్నారు.

ఇప్పుడు పోస్టింగ్ తీసుకున్న చోటే కనీసం రెండేండ్లు పని చేయాలని, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ల కోసం ప్రయత్నాలు చేయొద్దని కోరారు. హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఒక్క ఖాళీ కూడా ఉండొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని, అన్ని ఖాళీలనూ భర్తీ చేస్తామన్నారు. ఇతర ఏ వృత్తి, ఉద్యోగంలోనూ లేనంతగా, ప్రజల ప్రేమను పొందే అవకాశం డాక్టర్లకు ఉంటుందని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. డాక్టర్లకు ఏవైనా  సమస్యలు ఉంటే, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు.