
కరోనా వ్యాప్తి, సీజనల్ వ్యాధులపై తెలంగాణ ఆరోగ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీజన్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచించారు. కోవిడ్, డెంగ్యూ పేరిట దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ALSO READ | తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డే: కేటీఆర్
భారత్ సహా ఇతర దేశాల్లో కోవిడ్ పరిస్థితులపై మంత్రి రాజనర్సింహ్మకు వివరించారు అధికారులు. ఇండియాలో కోవిడ్ పరిస్థితి నార్మల్ గా ఉందన్నారు. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికే హాస్పిటలైజేషన్ అవసరం అని అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితమే ఎండెమిక్ స్టేజ్ లోకి కోవిడ్ ఉందన్నారు. కోవిడ్ కేసులు నమోదు కావటం, పెరగటం, తగ్గడం సహజమే అని మంత్రికి అధికారులు వివరించారు.
రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. వాతావరణ మార్పులతో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులేమీ లేవన్నారు.