తాడ్వాయి మండలంలో డయేరియాతో ఇద్దరు మృతి ? .. మరో 14 మందికి అస్వస్థత

తాడ్వాయి మండలంలో డయేరియాతో ఇద్దరు మృతి ? .. మరో 14 మందికి అస్వస్థత
  • ఆ ఇద్దరూ చనిపోయింది డయేరియాతో కాదు : హెల్త్ ఆఫీసర్లు

కామారెడ్డి/తాడ్వాయి, వెలుగు : కామారెడ్డి జిల్లా దేమికలాన్‌‌‌‌ గ్రామంలో డయేరియా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో 14 మంది హాస్పిటల్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మెట్టు స్వామి (32), కొనింటి భూమయ్య (70) మంగళవారం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని కామారెడ్డి హాస్పిటల్స్‌‌‌‌కు తరలించారు. అప్పటికే స్వామి చనిపోగా.. భూమయ్యను నిజామాబాద్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లగా మంగళవారం సాయంత్రం చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన మరో 14 మంది సైతం ఇదే సమస్యతో ఇబ్బంది పడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, హాస్పిటల్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నారు. 

విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు బుధవారం గ్రామంలో హెల్త్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామంలోని ఇల్లిల్లూ తిరుగుతూ విరేచనాలు, వాంతులతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే గ్రామంలో బోర్ల నీరు, మిషన్‌‌‌‌ భగీరథ ద్వారా సరఫరా అయిన నీటితో పాటు కల్లు శాంపిల్స్‌‌‌‌ను కూడా సేకరించారు. కాగా స్వామి, భూమయ్య చనిపోవటానికి డయేరియా కారణం కాదని ఆఫీసర్లు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి ఆర్డీవో వీణ, డీఎంహెచ్‌‌‌‌వో చంద్రశేఖర్‌‌‌‌తో పాటు పలువురు ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయించామని, వారిద్దరూ ఇతర జబ్బులతో చనిపోయినట్లు తేలిందన్నారు.