అమలుకు నోచుకోని హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్

అమలుకు నోచుకోని హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్

ఈ నెల ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ప్రారంభిస్తామన్న మంత్రి 
ఇప్పటికీ మొదలు కాని స్ర్కీనింగ్ పనులు
నాలుగేండ్ల నుంచి ఇదే పరిస్థితి
ఇంకో రెండు నెలలు పట్టొచ్చంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ మళ్లీ వాయిదా పడింది. సీఎం కేసీఆర్​ ప్రకటించి నాలుగేండ్లవుతున్నా అడుగు ముందుకు పడుతలేదు. ఈ నెల తొలి వారం నుంచే ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదు. డిసెంబర్ నెలాఖరుకు వచ్చినా కనీసం ఒక్క జిల్లాలోనూ స్క్రీనింగ్ ప్రారంభం కాలేదు. ఒమిక్రాన్  వల్ల వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్పీడప్ చేయాల్సి రావడం, ఉద్యోగుల విభజన, ములుగు జిల్లాలో మేడారం జాతర పనులు ఉండడంతో ఆలస్యమవుతున్నదని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఫిబ్రవరి చివరలో లేదా మార్చిలో ప్రారంభమయ్యే చాన్స్​ ఉందని ఓ సీనియర్​ ఆఫీసర్​ తెలిపారు. ఒకవేళ థర్డ్ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తే, అప్పుడు కూడా డౌటేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఆ మూడు ఊర్లలో టెస్టులకే పరిమితం
2018 ఎన్నికలకు ముందే హెల్త్ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కంటి వెలుగు తరహాలో రాష్ట్రంలో అందరికీ టెస్టులు చేయించి, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ఆయన  అనేకసార్లు చెప్పారు. 2019 జులైలో తన సొంత గ్రామం చింతమడకతోపాటు మాచాపూర్, సీతారాంపల్లిలో ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హెల్త్ క్యాంపులు పెట్టించారు. ఇదే హెల్త్ ప్రొఫైల్ ఆరంభం అని ప్రకటించారు. కానీ, అది కేవలం టెస్టులకే పరిమితమైంది. ఇప్పటికీ ఆయా గ్రామాల వాళ్లకు ఆ టెస్టుల రిపోర్టులు కూడా ఇయ్యలేదు. ఆ తర్వాత రెండేండ్ల వరకూ హెల్త్ ప్రొఫైల్ ఊసే ఎత్తలేదు. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించబోతున్నట్టు ఈ ఏడాది జూన్ 8న కేసీఆర్ మరో ప్రకటన రిలీజ్ చేశారు. టెస్టులకు అవసరమైన బడ్జెట్ విడుదల చేయకపోవడంతో అడుగుముందుకు పడలేదు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు బాధ్యతలు తీసుకున్నాక హెల్త్ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రివ్యూ చేసి అవసరమైన బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేయించారు. ఈ నెల మొదటి వారం నుంచి స్ర్కీనింగ్ స్టార్ట్ చేయాలని హరీశ్​ ఆదేశించారు. దీంతో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు ములుగు వెళ్లి రివ్యూ చేశారు.

2 జిల్లాలు 3 నెలలు
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో కలిపి 18 ఏండ్లు నిండినవాళ్లు 6.41 లక్షల మంది ఉన్నారు. హెల్త్ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా వీరికి టెస్టులు చేయడానికి ఒక్కో జిల్లాలో 90 రోజులు పడుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. అందరికీ ఐడీలు ఇవ్వడానికి మరో నెల రోజులు పడుతుంది. ఆఫీసర్లు చెప్తున్నట్టు ఫిబ్రవరి చివరిలో లేదా మార్చిలో స్టార్ట్ చేసినా, పైలట్ ప్రాజెక్ట్ జూన్ లేదా జులైలో పూర్తవుతుంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఫలితాలను బట్టి మిగిలిన జిల్లాల్లో స్ర్కీనింగ్ ప్రారంభిస్తారు. దీన్ని బట్టి చూస్తే.. 2022లో కూడా రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ పూర్తయ్యే సూచనలు కనిపించడంలేదు.