చెప్పుల్లేకుండా నడిస్తే ఏమవుతుందంటే..

V6 Velugu Posted on Mar 30, 2021

  • చెప్పుల్లేకుండా నడిస్తే ఒంటికే కాదు.. కంటి చూపునకూ మంచిదే

కాళ్లకి చెప్పులు తొడగందే అడుగు ముందుకు పడదు. మనలో చాలామందికి. కొందరైతే ఇంట్లోనూ చెప్పులు వేసుకునే ఉంటారు. దుమ్ము,  ధూళి దరిచేరొద్దన్న  ఆలోచనతో అలా వేసుకున్నా.. రోజులో కొద్దిసేపయినా చెప్పుల్లేకుండా నడవడమే మంచిది. శారీరకంగా, మానసికంగా బోలెడు మేలు ఉంది అందులోనే. అదెలా అంటారా! అయితే  ఇది చదవాల్సిందే..

చెప్పుల్లేకుండా నడవడం వల్ల  శరీరంలోని పాజిటివ్  అయాన్స్​ వెళ్లిపోతాయి. నెగెటివ్​ అయాన్స్​ శరీరంలోకి  వస్తాయి.  నెగెటివ్​ అయాన్స్​ నేచురల్​ యాంటీ డిప్రెసెంట్స్​గా పనిచేస్తాయి. టెన్షన్​, డిప్రెషన్​లని  దరిచేరనివ్వవు. మైండ్​కి, బాడీకి రిలాక్సేషన్​ ఇస్తాయి. 
యోగా, మార్షల్​ ఆర్ట్స్​ చేసేటప్పుడు కాళ్లకి చెప్పులేసుకోరు. ఎందుకంటే మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. చెప్పుల్లేకుండా  యోగా, మార్షల్​ ఆర్ట్స్​ చేయడం వల్ల  శరీరంలో ఆ నీరు పనితీరు సరిగా జరుగుతుంది. అచ్చం అలాగే కాళ్లకి చెప్పుల్లేకుండా నడవడం వల్ల బాడీ ఫంక్షనింగ్​ సక్రమంగా జరుగుతుంది. అలాగే వట్టి కాళ్లతో నడవడం వల్ల శరీరంలో అయాన్​లు​ బ్యాలెన్స్​ అవుతాయి. అవి మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. మెంటల్​ స్టెబిలిటీని పెంచుతాయి. 
చెప్పుల్లేకుండా నడవడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుంది.  కంటి సమస్యలున్న వాళ్లు  ఉదయం పూట​  చెప్పుల్లేకుండా గడ్డిపై నడిస్తే కాళ్లలోనే ప్రెజర్​ పాయింట్స్​  యాక్టివ్​ అవుతాయి. అవి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. 
డ్రెస్​ని బట్టి  రకరకాల చెప్పులు వేసుకుంటారు చాలామంది. హై హీల్స్​ కూడా ఎక్కువగా ​ వాడుతుంటారు. అయితే వాటివల్ల పొత్తికడుపు, నడుము, పాదాల్లో నరాల పనితీరు దెబ్బ తింటుంది.  అంతేకాదు వీటివల్ల పాదాల ఆకారం,  నడకలో కూడా మార్పులొస్తాయ్​. ఆ సమస్యకి చెక్​ పెట్టడానికి చెప్పుల్లేకుండా నడవడం బెస్ట్​ ఆప్షన్​. ప్రతిరోజు పావుగంట చెప్పుల్లేకుండా నడిస్తే వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది. గుండె పనితీరు కూడా బాగుంటుంది. 
చెప్పుల్లేకుండా నడవడం వల్ల హ్యాపీ హార్మోన్స్​ బ్యాలెన్స్​ అవుతాయి. దానివల్ల మానసిక ప్రశాంతత  దొరుకుతుంది. ఒత్తిడి దరిచేరదు. 
కాళ్లకి చెప్పుల్లేకుండా నడవడం వల్ల  పాదాలపై ఎలాంటి ఒత్తిడి పడదు. బ్లడ్​ సర్క్యులేషన్​ సక్రమంగా జరుగుతుంది. దాంతో కరోనరీ ఆర్టరీ వ్యాధులు దరిచేరవు. మోకాళ్ల నొప్పులు, గాయాలతో  బాధపడేవాళ్లకి రిలీఫ్ వస్తుంది. అంతేకాదు శరీరంలో బ్లడ్​ సర్క్యులేషన్​​ సక్రమంగా జరుగుతుంది.

Tagged Body, healthy, Walk

Latest Videos

Subscribe Now

More News