తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 10 కి వాయిదా

తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 10 కి వాయిదా

మల్కాజిగిరి కోర్టులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.  బెయిల్ పై తదుపరి విచారణ ఏప్రిల్ 10 కి  వాయిదా వేసింది కోర్టు. 

తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి. నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్ 3న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తీన్మార్ మల్లన్నపై పీటీ వారెంట్ జారీ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందని మల్లన్న తరపు న్యాయవాది వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్, కవిత,మంత్రి కేటీఆర్ పై అనుచిత పదజాలంతో  తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ప్రభుత్వ అడ్వొకేట్ రూపేందర్ కోర్టుకు తెలిపారు.  వాదనలు విన్న హైకోర్టు..   తీన్మార్ మల్లన్నపై ప్రిజనర్ ఆన్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ దాఖలు చేయొద్దని పోలీసులకు  ఉత్తర్వులు జారీ చేసింది.