బషీర్బాగ్, వెలుగు: పైరసీ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. రవిపై నమోదైన నాలుగు కేసుల్లో పోలీసులు కస్టడీ కోరడంతో న్యాయస్థానం నాలుగు రోజుల అనుమతి ఇచ్చింది. కానీ విచారణకు సమయం సరిపోదని, ప్రతి కేసుకు ఐదు రోజులు కావాలని పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీపై విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.

