తెలంగాణలో తెల్లారిన బతుకులు.. జిమ్కు వెళ్తూ అమ్మాయి.. లారీ కింద పడి ఇద్దరబ్బాయిలు స్పాట్ డెడ్

తెలంగాణలో తెల్లారిన బతుకులు.. జిమ్కు వెళ్తూ అమ్మాయి.. లారీ కింద పడి ఇద్దరబ్బాయిలు స్పాట్ డెడ్

జగిత్యాల జిల్లా: ఆదివారం ఉదయం తెలంగాణలోని పలు రోడ్లు నెత్తుటితో తడిచాయి. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో అదుపు తప్పిన కారు బస్సును ఢీ కొట్టింది. కారు, బస్సులో ప్రయాణిస్తున్న12 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు కోరుట్ల పట్టణం బాలాజీ రోడ్కు చెందిన వారిగా గుర్తించారు. కర్ణాటకలోని గానుగాపూర్ క్షేత్ర దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండలం నర్సాపురం  శివారులో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది.  లారీ- బైక్ ఢీకొన్న ఘటనలో లారీ కింద పడి ఇద్దరు యువకులు చనిపోయారు. మరొక ఘటనలో.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని BHEL  బస్ డిపో రోడ్డులో ఏలూరు డిపోకు చెందిన RTC బస్ ఢీ కొని స్కూటీపై వెళ్తున్న ఉమామహేశ్వరి (26) అనే యువతి  మృతి చెందిన ఘటన విషాదం నింపింది. 

రామచంద్రపురం బొంబాయి కాలనీ చెందిన ఉమామహేశ్వరి బీరంగూడ జిమ్లో కోచింగ్ ఇస్తుంది. రోజూ లాగే ఆదివారం ఉదయం కూడా తన స్కూటీ తీసుకొని బీరంగూడకు షార్ట్ కట్ అవుతుందని  BHEL డిపో వైపు  నుంచి బయలుదేరగా ఏలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని దుర్మరణం చెందింది. కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.