
హైదరాబాద్, వెలుగు: వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించనున్న ఎంట్రెన్స్ టెస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,61,616 దరఖాస్తులు అందగా, రూ.500 ఫైన్‌తో ఈ నెల 17 వరకు గడువుంది. ఈ సెట్‌కు 22,549 అప్లికేషన్లు రాగా, రూ.500 ఫైన్‌తో ఈ నెల 14 దాకా దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంది. ఐసెట్‌కు ఇప్పటివరకు 30,941 దరఖాస్తులు రాగా, ఈ నెల 27 వరకు ఫైన్ లేకుండా దరఖాస్తు చేయొచ్చు. పీజీఈసెట్‌కు 4,462 దరఖాస్తులు రాగా.. ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. లాసెట్, పీజీలాసెట్‌కు 24,242 అప్లికేషన్లు అందగా, ఈ నెల 16 దాకా దరఖాస్తు చేయొచ్చు. ఎడ్‌సెట్‌కు 16,437 అప్లికేషన్లు రాగా, ఈ నెల 15 వరకూ అప్లై చేసుకోవచ్చు. పీఈసెట్‌కు 1,128 దరఖాస్తులు రాగా.. ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. పీఈసెట్‌ను ఆగస్టు 22న నిర్వహిస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు.