ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల వ్యవధిలో 10,601 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 73 మంది మృతి చెందారు. 11,691 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు గుర్తించామన్నారు. లేటెస్టుగా నమోదైన కేసుల సంఖ్యతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,17,094కి చేరిందన్నారు. ఇవాళ్టి వరకు  4,560 మంది కరోనాతో చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.