మేడారానికి పోటెత్తిన భక్తులు .. సందడిగా వనం.. ఎత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు .. సందడిగా వనం.. ఎత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు

తాడ్వాయి : వనదేవతల దర్శనానికి భక్తులు పోటెతుతున్నారు.  మహాజాతరకు వారం రోజులు ఉండగా..  మండే మెలిగే పండుగ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు తెల్లవారుజామునుంచే భారీగా తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేశారు. ఎత్తు బంగారంతో క్యూలైన్ కట్టి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరారు. పసుపు కుంకుమ, చీరె సారే, బెల్లం( బంగారం) పూలు పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంటా వార్పు చేసుకొని భోజనాలు చేశారు. భక్తులతో మేడారం వనమంతా సందడిగా మారింది.  పోలీస్ లు  తొక్కిసలాట జరగకుండా బందోబస్తు నిర్వహించారు.  సుమారు 75 వేల మంది భక్తులు వచ్చినట్టు  ఎండోమెంట్ ఈవో మేకల వీరస్వామి తెలిపారు.