హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్తో.. రెండు బ్రిడ్జీలు కొలాప్స్

హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్తో.. రెండు బ్రిడ్జీలు కొలాప్స్

హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ తో భారీ నష్టం జరిగింది. పెద్దఎత్తున వరదలు సంభవించడంతో.. మనాలి, లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లహౌల్, స్పితిలో వంతెనలు కొట్టుకుపోయాయి. కొత్తగా నిర్మిస్తున్న మరో రెండు బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ అధికారులు, ఆర్మీ మరమ్మత్తు చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తర్వలోనే వాహనాల రాకపోకలు ప్రారంభిస్తామన్నారు బీఆర్వో అధికారులు. 

ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. కొండచరియలు విరిగిపడటంతో.. కేదార్ నాథ్ వెళ్లే భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ.. హెలికాప్టర్ లో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 

జమ్ముకశ్మీర్ లోనూ భారీ వర్షాలతో రోడ్లు తెగిపోయాయి. గండేర్ బల్ జిల్లాలో వరదలతో శ్రీనగర్, లేహ్ మధ్య ప్రయాణాలు నిలిచిపోయాయి. దీంతో మణిగం దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల భారీ వర్షాలు ఉండటంతో.. ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. 

దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతన్నాయంది వాతావరణ శాఖ. దీంతో మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  ఆ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ జారీ చేసింది ఐఎండీ.