సీఎం స‌హాయ‌నిధికి భారీ విరాళాలు.. ఒక్క‌రోజే రూ.8.30 కోట్లు

సీఎం స‌హాయ‌నిధికి భారీ విరాళాలు.. ఒక్క‌రోజే రూ.8.30 కోట్లు

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి శ‌నివారం రూ. 8 కోట్ల 30 లక్షల విరాళాలు అందజేశారు. ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ హైదరాబాద్‌ ఎండీ కేవీబీ రెడ్డి రూ.3కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లను తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఇందుకు సంబంధించిన చెక్కును అంద‌జేశారు.

పేపర్‌ బోర్డ్స్‌ అండ్‌ స్పెషాలిటీ పేపర్స్‌ డివిజన్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్లు విరాళంగా అందించింది. సంస్థ సీఈవో సంజయ్‌ సింగ్‌ కేటీఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఐటీసీ ఎండీ సంజీవ్‌ కుమార్‌ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. పోచంపాడ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవైట్‌ లిమిటెడ్‌ రూ. కోటి విలువైన పీపీఈ కిట్లను విరాళంగా అందించింది. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేసిన వారికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.