IPL 2026 Mini-auction: ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధం.. 10 జట్ల వద్ద ఉన్న డబ్బు ఎంతంటే..?

IPL 2026 Mini-auction: ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధం.. 10 జట్ల వద్ద ఉన్న డబ్బు ఎంతంటే..?

ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో జరగనున్న వేలానికి 350 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం (డిసెంబర్ 9) బీసీసీఐ ప్రకటించింది. వేలం కోసం నమోదు చేసుకున్న 1,355 మంది ఆటగాళ్లలో 1005 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఐపీఎల్ మెగా వేలం నుంచి తప్పించింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు మంగళవారం (డిసెంబర్ 16)న జరగబోయే ఆక్షన్ లో 350 మందిలో 77 స్లాట్స్ భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 2025 జట్టు నుండి కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 64.3 కోట్లతో వేలంలోకి అడుగుపెడుతుంది. స్టార్ వికెట్ కీపర్, ఆల్ రౌండర్ పై కేకేఆర్ ఫోకస్ చేయనుంది.    

చెన్నై సూపర్ కింగ్స్ రూ.43.4 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ రూ. 2.75 కోట్లతో అతి తక్కువ బ్యాగ్ కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ రూ. 11.5 కోట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై, పంజాబ్ జట్లకు స్టార్ ప్లేయర్లను కొనే అవకాశం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (25.5 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (22.95 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (21.8  కోట్లు) తమ వద్ద ఉన్న డబ్బును ఎలా వినియోగించుకుంటారో ఆసక్తికరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (16.4 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (16.05 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (12.9 కోట్లు) వద్ద తక్కువ పర్స్ ఉంది. 

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు 10 జట్ల వద్ద ఉన్న పర్స్:

కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 64.3 కోట్లు 

చెన్నై సూపర్ కింగ్స్ - 43.4 కోట్లు 

సన్‌రైజర్స్ హైదరాబాద్ - 25.5 కోట్లు
 
లక్నో సూపర్ జెయింట్స్ - 22.95 కోట్లు
 
ఢిల్లీ క్యాపిటల్స్ - 21.8  కోట్లు 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 16.4 కోట్లు
 
రాజస్థాన్ రాయల్స్ - 16.05 కోట్లు
 
గుజరాత్ టైటాన్స్ - 12.9 కోట్లు
 
పంజాబ్ కింగ్స్ - 11.5 కోట్లు 

ముంబై ఇండియన్స్ - 2.75 కోట్లు 

మొత్తం 350 మంది ఆటగాళ్లు డిసెంబర్ 16న జరగబోయే మినీ వేలానికి అందుబాటులో ఉంటారు. 350 మంది ఆటగాళ్లలో 240 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. మిగిలిన 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 112 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉంటే.. 238 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. 238 మందిలో 224 మంది ఇండియన్స్ కాగా.. కేవలం 14 మంది అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ మెగా ఆక్షన్ లో మొత్తం 77 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో 31 మంది విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. మొత్తం 10 జట్ల వద్ద రూ. 237.55 కోట్లు ఉన్నాయి.