హైదరాబాద్ లో 8.1 సెంటీ మీటర్లు వాన

హైదరాబాద్ లో 8.1 సెంటీ మీటర్లు వాన

ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని బంట్వారంలో 9.3 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదవుగా.. మేడ్చల్ జిల్లాలోని ప్రశాంత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 8.4 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్పల్లిలో 8.1 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరిలోని మధుసూదన్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 6.9 సెంటీమీటర్లు, వరంగల్లోని పైడిపల్లి ఏరియాలో 6.4 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురిసాయి.

ఇక జనగాం లోని అబ్దుల్ నగారంలో 6.3 సెంటీమీటర్ల మోస్తారు వర్షం నమోదవుగా.. హనుమకొండలోని ములుగు రోడ్లో 6.1, మేడ్చల్ జిల్లాలోని రాజీవ్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 5.9, యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారావు ఏరియాలో 5.4 సెంటీమీటర్లు, హైదరాబాద్ లోని పికెట్ హెల్త్ సెంటర్ వద్ద 5.3, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో 5.3, మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల ఏరియాలో ఐదు పాయింట్ రెండు, హన్మకొండలోని కాజిపేట్ లో 5.2, మేడ్చల్ మల్కాజ్గిరిలోని మహేశ్వర్ నగర్ వార్డ్ ఆఫీస్ వద్ద 5.2, నిర్మల్ జిల్లాలోని జామ వద్ద 5, రంగారెడ్డి జిల్లాలోని అమీర్పేట్ ఏరియాలో 5.1, నారాయణపేట ఏరియాలోని కోటకొండలో 5 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి లోని బీఆర్ అంబేద్కర్ భవన్ వద్ద 4.9 సెంటీమీటర్లు, అదే మేడ్చల్ మల్కాజ్గిరి లోని కుత్బుల్లాపూర్ లో 4.9,జనగాం లోని తాటికొండలో 4.8 సెంటీమీటర్ల మోస్తారు వర్షాలు కురిసాయి.

మల్కాజ్గిరి లోని ప్రశాంత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 8.4, సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లి లో 8.1, మల్కాజ్గిరి లోని మధుసూదన్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 6.9 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదవుగా.. కాప్రాలోని రాజీవ్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 5.9, ఎల్బీనగర్ లోని పికెట్ హెల్త్ సెంటర్ వద్ద 5.3, గాజులరామారంలోని జీడిమెట్ల వద్ద 5.2, కాప్రాలోని మహేశ్వర్ నగర్ వార్డ్ ఆఫీస్ వద్ద 5.2, గాజులరామారంలోని బీఆర్ అంబేద్కర్ భవన్ వద్ద 4.9, సికింద్రాబాద్లోని మెట్టుగూడ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ వద్ద 4.8, మల్కాజిగిరిలో 4.6 బేగంపేట్ లోని మొండా మార్కెట్ వద్ద 4.4 వర్షం పడింది. గాజులరామారంలోని షాపూర్ నగర్ లో 4.3, సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి కింది బస్తీ కమ్యూనిటీ హాల్ వద్ద 4.2, గాజులరామారంలోని ఉషోదయ కాలనీ పార్క్ వద్ద 4.2, చందానగర్లోని మాదాపూర్ లో 4.1, ఉప్పల్లోని చిలక నగర్ లో 3.7, చంద్రయన్గుట్టలోని ఓవైసీ కమ్యూనిటీ హాల్ వద్ద 3.5, చందానగర్ లోని హర్బల్ హెల్త్ సెంటర్ వద్ద 3.2 సెంటీమీటర్లు మోస్తారు వర్షాలు కురిసాయి.