
హైదరాబాద్‌లో భారీగా బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. బంగారు ఆభరణాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.2 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారం, కిలో వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాలను ఆదాయ పన్నుశాఖ అధికారులకు అప్పగించారు పోలీసులు.