కర్నాటకలో మూడు నెలలు భారీ ఊరేగింపులు నిషేధం

కర్నాటకలో మూడు నెలలు భారీ ఊరేగింపులు నిషేధం

కర్నాటకలో కరోనా కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. థర్డ్‌వేవ్ ప్రమాదంపై నిపుణులు హెచ్చరికల క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, మతపరమైన సమావేశాల్లో భారీగా గుమిగూడటం, ఊరేగింపులను ప్రభుత్వం బ్యాన్‌ విధించింది. ఆగస్టు-అక్టోబర్ వరకు పండుగ సీజన్‌ ప్రారంభంకానుంది. వరమహాలక్ష్మి వ్రతం, ముహర్రం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ తదితర పండుగ రోజుల్లో స్థానికంగా ఆంక్షలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం.